Anasuya: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!!

'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్‌పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.

Anasuya: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!!
New Update

Anasuya Comments on Rahul Ravindran tweet: బాలకృష్ణ  నటించిన భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. 'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్‌పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.

Also Read: మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!!

ఈ డైలాగులపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ దేవికగా స్పందిస్తూ.. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్య వంతులను చేయడం భగవంత్ కేసరి చిత్రం ద్వారా కేవలం వారం రోజల్లోనే సాధ్యమయిందని.. ఇతర మీడియా ద్వారా ఈ పని చేయాలంటే పదేళ్లు పడుతుందని అన్నారు. సినిమా ద్వారా దీన్ని సాధ్యం చేసిన బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పటికే రూ. 65 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అమ్మాయిలకు బాలయ్య చెప్పే సూచనలు సినిమా చూస్తున్న వారిని కాసేపు షాక్ కు గురి చేస్తాయి. ఏమీ తెలియని చిన్నారుల శరీర భాగాలను కామాంధులు ఎక్కడెక్కడ టచ్ చేస్తారు..అప్పుడు వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని అమ్మయిలకు వివరిస్తారు. బాలయ్య చెప్పే ఈ మాటలతో సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. ఈ ట్వీట్ కు నటి అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సార్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.

#anasuya-bharadwaj #bhagavanth-kesari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe