ఢిల్లీ వాయు కాలుష్యం గురించి స్పందించిన ఆనంద్ మహీంద్రా..ఈ పద్దతులు పాటించండి అంటూ! ఢిల్లీ వాయు కాలుష్యం పై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. పంట వ్యర్థాలను తగలపెట్టే బదులు పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. By Bhavana 08 Nov 2023 in నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు నాణ్యత రోజురోజుకి తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలోని స్కూళ్లకు నవంబర్ 10 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసింది. పంట వ్యర్థాలను ఎక్కుగా తగలబెట్టడం వల్లే వాయు కాలుష్యానికి ముఖ్య కారణమని అధికారులు ఎప్పుడో వెల్లడించారు. ఈ పరిస్థితి గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునే ఆనంద్..తాజాగా ఆయన ఢిల్లీ కాలుష్యం తగ్గడం గురించి ఓ చక్కటి సలహా ఇచ్చారు.'' పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీ వాయు కాలుష్యం (Air Pollution) తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. Also Read: తుమ్మల నివాసంలో సోదాలు ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాక నేల ఉత్పాదకతను కూడా పెంచుతుంది. పంట వ్యర్థాలను కాల్చడానికి బదులుగా ఈ పద్దతిని ఫాలో అయితే ఎంతో లాభదాయకం అని ఆయన వివరిస్తూ..అందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు. To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ— anand mahindra (@anandmahindra) November 7, 2023 కాలుష్యం వలన ఢిల్లీలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వాలు మారిన కాలుష్యం నియంత్రించడంలో మాత్రం అన్నీ విఫలమైయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టిన గాలి నాణ్యత మాత్రం పెరగడం లేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత పడిపోవడంతో అక్కడి ఆప్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి వాహన రేషన్ విధానాన్ని పునఃప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) సోమవారం ప్రకటించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ సర్కార్ ఇటీవలే విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కాలుష్యం తార స్థాయికి చేరడంతో అక్కడి ప్రభుత్వం స్కూళ్లకు, కాలేజీలకు సెలవులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆతిషి (Minister Atishi) ప్రకటించారు. ప్రైమరీ విద్యాసంస్థలకు పూర్తిగా సెలవు ఉంటుందని, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు చెప్పాలని పేర్కొన్నారు. అలాగే.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. నవంబర్ 10వరకు 50 శాతం మందితో కార్యాలయాలను నడపాలని.. మిగితా వారికి వర్క్ ఫ్రామ్ హోమ్ ఇవ్వాలని తెలిపారు. కాలుష్య స్థాయి భట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. #anand-mahindra #delhi-air-pollution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి