Anand Devarakonda : ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా? 'బేబీ' సాంగ్ ఎంత బాగా పాడాడో చూడండి! 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. ఈ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి..ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 11 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Anand Devarakonda Singing Video Going Viral : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడిగా టాలీవుడ్ (Tollywood) కి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda).. 'బేబీ' సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే 'గం, గం గణేశా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన లోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టి ఆడియన్స్ ను అలరించాడు. ఇక తాజాగా ఈ హీరో ఫ్యామిలీతో కలిసి అమెరికా (America) లో నిర్వహించిన ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. ఈ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఆనంద్ ఈ సాంగ్ ని అద్భుతంగా పాడటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. Also Read : మర్డర్ కేసులో ‘పోకిరి’ రీమేక్ హీరో అరెస్ట్..! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆనంద్ దేవరకొండ చాలా బాగా పాడాడని, ఆనంద్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ మూవీలో ఆనంద్ దేవరకొండ ఓ సాంగ్ పడితే బాగుంటుందని అంటున్నారు. A heartwarming rendition💖@ananddeverkonda sings the beautiful & magical melody #OoRenduPremaMeghalila from #Baby 😍#AnandDeverakonda #ATA pic.twitter.com/9Py6paUxyl — GSK Media (@GskMedia_PR) June 11, 2024 #tollywood #america #anand-deverakonda #anand-deverakonda-singing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి