/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-07T182107.533-jpg.webp)
Anand Devarakonda : సినీ పరిశ్రమ(Cine Industry) లో ప్రతిష్టాత్మకంగా భావించే గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ 2024(Gama Telugu Movie Awards 4th Edition) వేడుకలో దుబాయి(Dubai) లో ఘనంగా జరిగాయి. 2021, 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించి వివిధ క్యాటగిరీల్లో తెలుగు నటీ నటులకు అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమా డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ ఇలా మొత్తం 43 విభాగాల్లో 'గామా' అవార్డ్స్(GAMA Awards) ను అందజేశారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ నటులు, యంగ్ హీరోస్, హీరోయిన్స్ సందడి చేశారు. డింపుల్ హయతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్, నేహా శెట్టి, ఫరియా అబ్దుల్లా డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.
Also Read: Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!
ఉత్తమ నటుడిగా ఆనంద్
అయితే ఈ వేడుకల్లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 'బేబీ' సినిమాలో ఆనంద్ హార్ట్ టచింగ్ పర్ఫామెన్స్ కు గానూ 'గామా' అవార్డు వరించింది. ఈ విషయాన్నీ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు ఈ యంగ్ హీరో. తన సంతోషాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
ఆనంద్ పోస్ట్
ప్రేక్షకులు సినిమాను ఆదరించడం కంటే గొప్పది ఏమీ లేదు.. కానీ ఇలాంటి అవార్డులు, గుర్తింపు రావడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి . ముందు ముందు ఇంకా మంచి పాత్రలు, గొప్ప సినిమాలు రానున్నాయి. ఈ సందర్భంగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, ప్రొడ్యూసర్ skn కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'బేబీ' విషయంలో నా పై వారు పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు అని తెలిపారు.
Best Actor 2023
There’s nothing bigger or better than acceptance of the movie in theatres…but awards & recognition always feel special.
A lot more to come, many good characters and great films in the near future.Would like to thank the Mad Creative Director, Sai Rajesh &… pic.twitter.com/rvoID9NON3
— Anand Deverakonda (@ananddeverkonda) March 7, 2024
Also Read: Balakrishna: గాలికి విగ్ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?