Anand Devarakonda : ఫ్యామిలీ స్టార్' పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ

‘గం.గం.. గణేశా’ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' దుష్ప్రచారం పై స్పందించాడు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే విజయ్ ఓల్డ్ మూవీస్ నెగెటివ్ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఎవరు చేస్తున్నారో తెలీడం కోసమే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చామని అన్నాడు.

Anand Devarakonda : ఫ్యామిలీ స్టార్' పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ
New Update

Anand Devarakonda Reacts On Family Star Negative Trolls : గత ఏడాది ‘బేబి’ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda). ఈ సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ఇక ఈ ఏడాది నవ్వించేందుకు రెడీ అయ్యాడు.

ఈసారి డిఫెరెంట్ గెటప్ తో ‘గం.గం.. గణేశా’ అంటూ సరికొత్త థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తన అన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) దుష్ప్రచారం పై సైబర్ క్రైం కంప్లైంట్ పై స్పందించాడు.

Also Read : రెండు ఓటీటీల్లో ప్రభాస్ ‘కల్కి’.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్!

అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాము

గం.గం..గణేశా (Gam Gam Ganesha) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.." ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవ్వడానికి 48 గంటల ముందే విజయ్ దేవరకొండ ఓల్డ్ మూవీస్ కి సంబంధించిన నెగెటివ్ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టారు. దీంతో ఆడియన్స్ గందరగోళానికి గురయ్యారు. సినిమా చూసిన తర్వాత రిజల్ట్ గురించి ఎవ్వరైనా మాట్లాడొచ్చు.

కానీ రిలీజ్ కాకముందే టార్గెట్ చేసి ఎటాక్ ఎందుకు చేస్తున్నారు? అలంటి వాళ్ళు ఇండస్ట్రీకే ప్రమాదం. ఇది సరైన పద్దతి కాదు. ఇలా ఎందుకు చేస్తున్నారు?ఎవరు చేస్తున్నారు? అనేది తెలీడం కోసమే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాము. ఇవన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండ నుంచి ఇకపై మంచి సినిమాలే వస్తాయి. రీసెంట్ గానే మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అవి కచ్చితంగా మీకు నచ్చుతాయి" అని అన్నాడు.

#anand-devarakonda #family-star-negative-trolls #family-star #vijay-devarakonda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe