Shanthi-Madan: శాంతి ఉద్యోగం ఊస్ట్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు! దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై ఆరోపణలు ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని, శాఖాపర విచారణ, ఆధారాల సేకరణలో అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు. By srinivas 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Anam Ramanarayana: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై టీడీపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై కఠి చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆనం మాట్లాడుతూ.. శాంతి నియామకం వేళ ఏపీపీఎస్సీలో ఆంజనేయులు కీలకంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీపీఎస్సీ వివరణ తర్వాత.. ఇక శాంతి నియామకంలో తప్పులు జరిగితే ఆంజనేయులు కూడా బాధ్యుడవుతాడని, శాఖాపర విచారణ, ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరుతామన్నారు. విశాఖలో పనిచేసినప్పుడు శాంతిపై పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ప్రేమ సమాజ, భూముల విషయంలో శాంతిపై ఆరోపణలు చేశారు. విశాఖ భూదందాలో శాంతితో పాటు సుభాష్ పైనా ఫిర్యాదులున్నట్లు చెప్పారు. త్వరలోనే అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతామన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో 46 ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి ఉందని, ఇందుకు రూ.36 కోట్ల పరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆలయ నిర్మాణాలు జరిగితే నిధులు విడుదల అవుతాయని ఆనంవివరించారు. ఇది కూడా చదవండి: Sudan: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య! రోజుకో ట్విస్ట్.. ఇదిలా ఉంటే.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, మదన్‌మోహన్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలని శాంతికి సర్కార్ నోటీసులు ఇచ్చింది. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో తన భర్తగా శాంతి మదన్‌మోహన్ (Madhan Mohan) పేరు పేర్కొంది. 2023 ప్రసూతి సెలవుల కోసం అప్లయ్ టైమ్‌లో కూడా మదన్‌మోహన్ పేరే చెప్పిన శాంతి..17న సుభాష్‌ను పెళ్లిచేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో చెప్పింది. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్న సర్కార్..15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు అందించింది. దేవాదాయ శాఖ ప్రతిష్టకు కలిగిన భంగంపై వివరణ ఇవ్వాలని కమిషనర్ సత్యనారాయణ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 2న శాంతిని సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే, తాజాగా ఆమెపై ఆరు కొత్త అభియోగాలు నమోదు అయినట్లు తెలుస్తోంది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయనున్నట్లు సమాచారం. #shanthi #andrapradesh #anam-ramanaraya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి