Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం

దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్‌-2లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 160 దేవాలయాలను రూ.113 కోట్లతో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

New Update
Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం

Also Read: అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని 160 దేవాలయాలను రూ.113 కోట్లతో పునర్నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. 13 వెనుకబడిన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో ఉన్న గుళ్లనూ పునర్నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. కృష్ణ , గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. భగవంతుని ఆస్తులను పరిరక్షించేందుకు సిద్ధంగా ఉండటమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలలో తిరుమల నుంచి ఉత్తరాంద్రలోని అరసవిల్లి వరకూ ఎక్కడా కూడా దేవుని ఆస్తులను వదల్లేదన్నారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో నివేదికలు తెప్పించుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు