AP: సంచలనంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.! అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. హత్య జరిగి 40 గంటలు దాటినా నిందితుడి ఆచూకీ దొరకడం లేదు. By Jyoshna Sappogula 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Anakapalli: ఏపీలో అనకాపల్లి జిల్లా మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. బాలికను అత్యంత దారుణంగా కడతేర్చిన నిందితుడు సురేష్ ఆచూకీ 40 గంటలు దాటినా దొరకడం లేదు. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. సురేష్ కోసం 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. Also Read: ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. షర్మిలే..వైఎస్‌ఆర్ వారసురాలు.. రాహుల్ గాంధీ స్పెషల్ వీడియో..! విశాఖ సెంట్రల్ జైల్లో సురేష్‌కు ఉన్న పరిచయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు బాలిక హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. Also Read: ఘనంగా వైఎస్‌ఆర్ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భోవోద్వేగానికి లోనైన విజయమ్మ..! కేసులో నిందితుడు రాసిన లేఖ కీలకంగా మారింది. హత్యకు కారణాలను వివరిస్తూ బాలిక అన్నయ్యకు నిందితుడు సురేష్ లేఖ రాసి ఘటనాస్థలం వద్ద ఉంచాడు. గతంలో బాలికను సురేష్ వేధిస్తే పోలీసులు పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. బెయిల్ మీద బయటకు వచ్చాక తనతో ఎవరూ మాట్లాడకపోవడంతో బాలిక మీద కక్ష పెంచుకున్న సురేష్ బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. #anakapalli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి