Anakapalli Murder Case: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య

AP: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి (మం) కొప్పుగుండుపాలెంలో సురేష్‌ మృతదేహం లభ్యమైంది. నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలించారు.

New Update
Anakapalli Murder Case: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య

Anakapalli Murder Case:అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండెం పాలెంలో సురేష్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. సురేష్‌ ఇంటికి దగ్గరలోని పొలాల్లో మృతదేహం లభ్యమైంది. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలించారు. నైన్త్‌ క్లాస్ స్టూడెంట్‌ చంపిన సురేష్‌.. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహంపై బ్లాక్‌ కలర్‌ టీషర్ట్‌, ట్రాక్‌ ప్యాంట్‌ ఉన్నాయి. బాలిక హత్య సమయంలో అదే డ్రెస్‌తో సురేష్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 4 రోజుల కిందట విద్యార్థినిపై కత్తితో ఉన్మాది దాడి చేశాడు. అక్కడిక్కడే బాలిక చనిపోయింది. కొప్పుగుండుపాలెంలో నైన్త్‌ క్లాస్‌ చదువుతోంది బద్ది దర్శిని. ప్రేమపేరుతో బాలికను సురేష్‌ వేధించాడు. ఏడాది కిందట రాంబిల్లి పోలీసులకు బాలిక పేరెంట్స్‌ ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. ఇటీవలే బెయిల్‌పై సురేష్‌ బయటకు వచ్చాడు. బాలిక స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో దాడి చేసి హతమార్చాడు.

Advertisment
తాజా కథనాలు