క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి..

క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడికి ప్రైవేట్ భాగంలో బంతి తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే..

New Update
క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి..

జెంటిల్మెన్‌ గేమ్‌ గా చెప్పుకునే క్రికెట్‌ లో అప్పుడప్పుడూ కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఈ ప్రమాదాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ఆటగాళ్ల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ మరణం ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులను వెంటాడుతోంది. తాజాగా అలాంటిదే మరొక ఘటన చోటు చేసుకుంది.

రహస్య భాగానికి బంతి తగలడంతో క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిందీ ఘటన. బంతి బాలుడికి తగలడం, ఆ వెంటనే అతడు కుప్పకూలిపోవడం అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయింది. బాధిత కుర్రాడు శౌర్య బౌలింగ్ చేయగా బ్యాటర్ బలంగా కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి రహస్య భాగాలకు తాకింది. ఆ వెంటనే బాలుడు కుప్పకూలిపోయాడు.

బాలుడు కిందపడడంతోనే ఆందోళన చెందిన మిగతా కుర్రాళ్లు వెంటనే అతడి వద్దకు చేరుకుని లేపే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శౌర్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు