'Amma' : మాటలు సరిగా రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్‌.. ఆవిష్కరించిన NIT విద్యార్థులు.!

మాటలు సరిగా రాని పిల్లల కోసం NIT వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్‌ ఆవిష్కరించారు. నిట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ హెడ్‌ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు ఆదర్శరావు, సయ్యద్‌ ఫర్జానుద్దీన్‌ దీన్ని రూపొందించారు.

New Update
'Amma' : మాటలు సరిగా రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్‌.. ఆవిష్కరించిన NIT విద్యార్థులు.!

'Amma' App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ (Amma) పేరిట యాప్‌ ఆవిష్కరించారు. నిట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ హెడ్‌ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు ఆదర్శరావు, సయ్యద్‌ ఫర్జానుద్దీన్‌ దీన్ని రూపొందించారు.

Also Read: వేసవిలో మీ ముఖానికి రోజూ దీన్ని అప్లై చేయండి.. తేడా గమనించండి!

సోమవారం ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital) లోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ (డైక్‌)లో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్‌ అధికారి (DEO) డాక్టర్‌ ప్రకాశ్‌కు వారు యాప్‌ను అందిస్తున్నట్లు అంగీకారపత్రం ఇచ్చారు. నిత్యం ఇక్కడి డైక్‌ విభాగానికి 20 మంది వరకు స్పీచ్‌ థెరపీ కోసం వస్తుంటారు. డా.కె.వి.కాదంబరి మాట్లాడుతూ.. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా.. మాటలు రాని, బుద్ధిమాంద్యం (ఆటిజం) గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్లు చెప్పారు.

Also Read: ఖర్జూరాలతో అందమైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే?

ఉదాహరణకు యాప్‌లో ఆపిల్‌ బొమ్మను చూపిస్తూ పిల్లలతో పలికిస్తే.. వెల్‌డన్‌ అని సమాధానం వస్తుంది. ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించేలా యాప్‌ ఉంటుందని, చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఒక వ్యాయామంలా (Exercise) ఉపయోగపడనుందని తెలిపారు. త్వరలో దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉంచుతామన్నారు. మంగళవారం నుంచి యాప్‌ను లింక్‌ రూపంలో పిల్లల తల్లిదండ్రులకు పంపి డౌన్‌లోడ్‌ చేయించి అవగాహన కల్పిస్తామని డాక్టర్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు