/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shah-2-jpg.webp)
Telangana Elections 2023: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 18న తెలంగాణలో పర్యటించున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సకల జనుల సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈనెల 17నే ఆయన తెలంగాణ రావాల్సి ఉన్నప్పటికీ షెడ్యూలు మరుసటి రోజుకు వాయిదా పడింది. 18న ఉదయం 10 గంటలకు గద్వాల, 12 గంటలకు నల్లగొండ, మధ్యాహ్నం 2గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం కోటలో జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ఎస్సీ వర్గీకరణపై హామీ పరిణామాలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచాయి. ఎన్నికల లోపు మరిన్ని సభలకు మోదీ హాజరయ్యే అవకాశం కూడా ఉందని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపి వారికి దిశానిర్దేశం చేసేలా ఉంటుందని పార్టీ నాయకులు చెప్తున్నారు.