Allu Arjun-Amittab: నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్‌ బి ప్రశంసలు!

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి అమితాబ్ కౌన్‌ బనే గా కరోడ్‌ పతి షో లో ప్రస్తావించారు. సినిమా పై , అల్లు అర్జున్‌ నటన పై ఆయన ప్రశంసలు కురిపించారు.

Allu Arjun-Amittab: నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్‌ బి ప్రశంసలు!
New Update

టాలీవుడ్ (Tollywood) స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun)  - రష్మిక (Rashmika)  జంటగా సుకుమార్‌ (Sukumar)  దర్శకత్వంలో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిన చిత్రం పుష్ప (Pushpa) . ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా..అంతర్జాతీయ నటుడిగా (National Award)  అవార్డును కూడా అందుకున్నాడు. పుష్ప సినిమాకి ప్రాణం పోసింది అంటే పాటలనే చెప్పుకొవచ్చు.

పుష్ప సినిమాలో బన్నీ నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్‌ అయిన జపాన్‌ లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. అటు బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అల్లు నటనకు పిచ్చ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్‌ పై బిగ్‌ బీ అమితాబ్ (Amitab)  ప్రశంసలు కురిపించాడు.

Also read: అంబులెన్స్‌ లేక చనిపోయిన చెల్లిని బండి మీద తీసుకెళ్లిన అన్న!

అమితాబ్‌ వ్యాఖ్యాతగా హోస్ట్‌ గా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎంతో కాలం నుంచి ఈ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో అమితాబ్‌ ..అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు. 2023 లో నేషనల్‌ అవార్డు విన్నర్‌ ఎవరు..? అన్న ప్రశ్నకు కంటెస్టెంట్‌ అల్లు అర్జున్‌ అని సరైన సమాధానం తెలిపి నెక్ట్స్‌ రౌండ్‌ కు వెళ్లింది.

ఇక ఈ ప్రశ్న తరువాత..అమితాబ్‌ మాట్లాడుతూ.. పుష్ప అద్భుతమైన సినిమా అందులోని శ్రీవల్లి పాట నిజంగా ప్రభంజనాన్ని సృష్టించింది. చెప్పు కాలి నుంచి జారి పడిపోవడం కూడా వైరల్‌ అవ్వడం అనేది నేను ఈ సినిమా నుంచే చూశాను. నేను జీవితంలో మొదటి సారి చూశాను.

ఆ పాట వచ్చిన తరువాత ఎవరూ చూసినా కూడా చెప్పు వదిలేసి డ్యాన్స్‌ చేయడం నేను చూశాను. ఒక పాటకు అంతగా పాపులారిటీ రావడం నేను కూడా ఎప్పుడూ చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఇక వీడియో చూసిన అభిమానులు అది అల్లు అర్జున్ రేంజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

#tollywood #allu-arjun #amitab #koun-banega-karod-pathi #show
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe