/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-11-jpg.webp)
Amitabh Bachchan and Rajinikanth: దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత తన మెంటార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందన్న సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ స్పందించారు.
రజనీకాంత్ (Rajinikanth) సర్ అని సంబోధిస్తూ.. ‘తలైవర్170’ (THALAIVAR 170) టైటిల్‌ను చూశానని, తలైవర్ అంటే నాయకుడు, అధిపతి, ముఖ్యుడు అని పేర్కొన్నారు. మీరు అధిపతి, నాయకుడు, చీఫ్.. ఈ విషయంలో ప్రజలకేమైనా సందేహముందా? అని ప్రశ్నించారు. తనను తాను రజనీకాంత్‌తో పోల్చుకోలేనని తేల్చి చెప్పారు. మీతో కలిసి మళ్లీ పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవమంటూ ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read: నేను బయట, అతను లోపల.. చంద్రబాబుపై ఆర్జీవీ సెటైర్..!
@rajinikanth ... sirrrrr .. 🙏 .. you are too gracious to me , but just see the Title of the Film , its THALAIVAR 170 ..
Thalaivar means Leader, Head, Chief ..
You are the head, the Leader and the Chief .. ANY DOUBT people .. ?? I cannot compare myself with you !
My great… https://t.co/4JIfgopuaU— Amitabh Bachchan (@SrBachchan) October 25, 2023
రజనీకాంత్ 170వ సినిమాను ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞాన్‌వేల్ ‘తలైవర్ 70’ వర్కింగ్ టైటిల్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కేరళలలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
‘తలైవర్ 170′ సినిమాలో 33 సంవత్సరాల తరువాత నేను నా గురు సమానులు, గొప్ప వ్యక్తి అయిన అమితాబ్ బచ్చన్‌తో కలిసి పని చేస్తున్నాను. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా మనసు ఆనందంతో గంతులేస్తుంది.’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. తలైవర్ 170 సెట్‌లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫోటోలో అటు తలైవా.. ఇటు బిగ్ బి ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియన్ ఫిల్మ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇద్దరూ కలిసి గతంలో పలు హిందీ సినిమాలో పని చేశారు. వీరిద్దరూ చివరి సారిగా 1991లో ముకుల్ ఆనంద్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘హమ్’లో వెండితెరపై కనిపించారు. ఆ సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ముల్లా నటించి, ప్రేక్షకులను అలరించారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తుండటంతో ‘తలైవర్ 170’ సినిమాకు ఫుల్ హైప్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే.. ‘తలైవర్ 170’ సినిమాతో బిగ్ బి కోలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం.