/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-11-jpg.webp)
Rajinikanth, Amitabh Bachchan : సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 32 ఏళ్ళ తర్వాత కలిసి తెరపై కనిపించబోతున్నారు. 'జై భీమ్'' మూవీ దర్శకుడు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా 'వెట్టయాన్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ ప్లే చేస్తన్నారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ ముంబై(Mumbai) లో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా అమితాబ్ బచ్చన్ శుక్రవారం సెట్స్ లో అడుగుపెట్టారు.
రజినీకాంత్, అమితాబ్ ఆలింగనం
ఈ సందర్భంగా రజినీకాంత్, అమితాబ్ ఇద్దరు సెట్స్ లో ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్', 'ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలే ఈ రేంజ్ లో ఉంటే..ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో, వెయిటింగ్ ఫర్ వేట్టయాన్' అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
The Titans of Indian Cinema! 🌟 Superstar @rajinikanth and Shahenshah @SrBachchan grace the sets of Vettaiyan in Mumbai, with their unmatched charisma. 🤩🎬#Vettaiyan 🕶️ pic.twitter.com/MDkQGutAkb
— Lyca Productions (@LycaProductions) May 3, 2024
కాగా గతంలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి 'అందా కానూన్', 'హమ్', 'గిరాఫ్తార్' వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కన్పించబోతుండటంతో ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
రజినీకాంత్(Rajinikanth) కెరీర్ లో 170 వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటూ దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషితున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.