NTR and Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి భేటీ కాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది మునుగోడు ఎన్నికల సందర్భంగా వీరిద్దరి భేటీ కొనసాగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న నొవాటెల్ హోటల్ లో దాదాపు అరగంట సేపు వీరు భేటీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారనే వార్తలు ఆసక్తిని రేపుతోంది.
Also Read: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..కంగనా సంచలన వ్యాఖ్యలు.!
అయితే, ఎలాగైనా సరే తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా బీజేపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ని కూడా తెలంగాణ ఎన్నికలకు వాడుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
అతి త్వరలోనే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకి రాబోతున్నాడు.ఈ పర్యటనలో భాగంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే, గతం లో కూడా మునుగోడు ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించాడు. నొవాటెల్ హోటల్ లో దాదాపు అరగంట సేపు వీరు మాట్లాడుకున్నారు.
అయితే, వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అసలేం చర్చించుకున్నారు అనేది మాత్రం బయటకురాలేదు. బీజేపీ అధిష్టానం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ని ఇంత ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఎందుకంత ప్రేమను కురిపిస్తోంది? ఎన్టీఆర్ ను బీజేపీ పార్టీ లోకి కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారా ? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తి గా దూరమై, కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు. టీడీపీ అనేకసార్లు సంక్షోభం లో చిక్కుకున్నప్పుడు కూడా ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరూ ఎన్టీఆర్ కచ్చితంగా మద్దతూ తెలుపుతాడని అనుకున్నారు. కానీ, ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి కూడా స్పందించనే లేదు.