డిసెంబర్ 13న లోక్‌సభ(LokSabha) లోపలకి ఇద్దరు వ్యక్తులు దూసుకురావడం.. స్మోక్ స్టిక్స్‌తో అలజడి సృష్టించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ దాడి ఘటనపై కేంద్రం టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. పార్లమెంట్(Parliament)లోనే భద్రతా ఉల్లంఘన జరిగేతే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో వివరణ ఇవ్వాలని పట్టబట్టాయి. ఆయన ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అమిత్‌షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇక తాజాగా ఈ ఘటనపై అమిత్‌షా స్పందించాడు. లోక్‌సభ వేదికగా స్పందించలేదు కానీ 'అజెండా ఆజ్‌తక్(Agenda AajTak 2023) సెషన్‌లో రియాక్ట్ అయ్యారు.
అమిత్‌షా ఏం అన్నారంటే?
తనను విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై రివర్స్ అటాక్ చేశారు అమిత్‌షా(Amit Shah). ఈ దాడి ఘటనను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని.. అంతేకానీ ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం సరికాదన్నారు అమిత్‌షా. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని పొలిటికల్ గేమ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. భద్రతా లోపం ఉన్న మాట నిజమేనని... అయితే పార్లమెంట్ భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉందని అందరికీ తెలుసని గుర్తు చేశారు. స్పీకర్ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని.. విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆ నివేదికను త్వరలో స్పీకర్‌కు పంపుతాం అని స్పష్టం చేశారు.
భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పిన అమిత్‌షా.. లోక్‌సభ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి లోపాలు ఉండకూడదని.. దీన్ని రాజకీయ సమస్యగా మార్చవద్దని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే మోదీ కూడా స్పందించినట్టు సమాచారం. లోక్‌సభలో భద్రతా లోపాలను సీరియస్‌గా తీసుకోవాలని మోదీ సీనియర్ మంత్రులను కోరినట్లు సమాచారం. ఈ ఘటన విషయంలో రాజకీయాల జోలికి వెళ్లవద్దని.. మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో మోదీ సీనియర్ మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: సభలోనే లేడు.. కానీ సస్పెండ్ చేశారు.. ఇదేక్కడి వింత భయ్యా!
WATCH: