Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన

వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తాము ఈ నెల 23నే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. అయినా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు.

Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన
New Update

Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఈ సంఘటనపై ఈ రోజు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ఈ నెల 23న హెచ్చరించినట్లు చెప్పారు. అయినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సరైన సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని ఆరోపించారు. వయనాడ్‌ ఘటనపై రాజకీయం తగదని అన్నారు. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడూ రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. NDRF బృందాలు 24 గంటలుగా కష్టపడుతున్నాయని అన్నారు. ఇదిలా ఉంటే.. కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే 150 మందికి పైగా మృతి చెందారు. మరో 600 మందికి పైగా గల్లంతు అయ్యారు. ఇందుకు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read : వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే?

#amit-shah #wayanad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe