Amit Shah-Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ.. పురందేశ్వరి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

నిన్న సాయంత్రం అమిత్ షాతో నారా లోకేష్ భేటీ కావడం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కోసం పురందేశ్వరి ఈ స్కెచ్ వేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ పొత్తుకు ఇది సంకేతమన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

New Update
Amit Shah-Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ.. పురందేశ్వరి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

నిన్న నారా లోకేష్ (Nara Lokesh) కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ను (Amit Shah) కలవడం ఏపీలో మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి ఉండడం రాజకీయ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి కలయిక సాధారణంగానే జరిగిందా? లేదా రాజకీయ మార్పులకు నాంది కానుందా? అన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వైసీపీ మాత్రం లోకేష్ అమిత్ షాను కలవడంపై తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. చంద్రబాబును కాపాడడం కోసమే పురందేశ్వరి తాపత్రయపడుతోందని ఆరోపిస్తోంది. పురందేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు కానీ.. ఆమె వ్యవహరిస్తున్న తీరు మాత్రం టీడీపీ అధ్యక్షురాలిలా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సంచలన ఆరోపణలు చేశారు. పురందేశ్వరి డిల్లీ వెళ్లి చంద్రబాబు ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో వాఖ్యానించారు. ఆమె బీజేపీకి అధ్యక్షురాలిగా ఉండి టీడీపీ కోసం పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Lokesh-Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. కేంద్ర హోంమంత్రి దృష్టికి చంద్రబాబు అరెస్ట్‌ అంశం..

మంత్రి అంబటి రాంబాబు సైతం నిన్న ఇలాంటి వాఖ్యలే చేశారు. వీరి వాఖ్యలకు ఊతం ఇచ్చేలా నిన్న సాయంత్రం నారా లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడం, పురందేశ్వరితో కేంద్ర హోంమంత్రిని కలిసి చంద్రబాబు అరెస్ట్ పై అమిత్‌ షాకు వివరించడం జరిగిపోయింది. ఈ భేటీ చంద్రబాబు కేసుతో పాటు ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీకి పొత్తు కుదిర్చేందుక పురందేశ్వరి మద్యవర్తిత్వం వహిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం జిల్లాలో తమకు కలసి వస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి సైతం నారా లోకేష్, అమిత్ షా భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు