Murdoch: 93 ఏళ్ల వయసులో ప్రేమ.. ఐదో పెళ్లికి సిద్ధమైన వృద్ధ జంట!

అమెరికన్‌ బిజినెస్ మెన్ రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 4పెళ్లిళ్లు చేసుకున్న ఆయన ఇప్పుడు 67 ఏళ్ల ప్రియురాలు ఎలీనా జుకోవాను మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లనుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

author-image
By srinivas
New Update
Murdoch: 93 ఏళ్ల వయసులో ప్రేమ.. ఐదో పెళ్లికి సిద్ధమైన వృద్ధ జంట!

Marriage: ప్రముఖ ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ బిజినెస్ మెన్ రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన 93 ఏళ్ల వయసులో ఐదోసారి మరో మహిళను మనువాడేందుకు ఉత్సహం చూపుతున్నాడు. అయితే ఈ పెళ్లి కూడా లవ్ అండ్ ఆరేంజ్ కావడం విశేషం. మర్దోక్‌ అనే 67 ఏళ్ల ప్రియురాలు ఎలీనా జుకోవాతో ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నాడు.

ఆరోసారి ఎంగేజ్‌మెంట్‌..
ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రూపర్ట్‌ మర్దోక్‌ ఐదో వివాహం కాగా.. ఆరోసారి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇక జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపించారని తెలుస్తోంది. బిలియనీర్‌ అయిన మర్డోక్ గతేడాది ఆన్‌ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోగా నెల వ్యవధిలోనే వీడిపోయారు. దీంతో కొన్ని నెలలకు తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్న వీరు.. త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస రాగా.. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో పెళ్లి జరిగింది.

ఇది కూడా చదవండి: E-Summit: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం!

అత్యంత ఖరీదైన భరణం..
అయితే మర్దోక్‌ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను పెళ్లిచేసుకోగా 1960ల్లో ఈ బంధం తెగిపోయింది. తర్వాత జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌, అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో డివోర్స్ తీసుకున్నారు. తన రెండో భార్య నుంచి విడిపోయిన సందర్భంలో ఆయన చెల్లించిన భరణం.. అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. 1950ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్‌.. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ వార్తా పత్రికలను నడిపించాడు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేసి.. 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను ప్రారంభించారు. 2011లో ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించిన ఆయన.. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు