Godavari flood: గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి ఉధృతం

ఐదు రోజులుగా ఏపీని వర్షాలు వీడటం లేదు. భారీ వానతో గోదారమ్మ (Godavari River) వరద ప్రవాహం మరింత ఉధృతంగా మారుతుంది. ఈ భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి నదిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకా గోదావరి ఎంత ఉగ్రరూపం దాల్చుతుందోనని భయంతో జీవిస్తున్నారు.

Godavari flood: గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి ఉధృతం
New Update

Ambedkar Konaseema District Gogul Lanka Emergence of Vashishtha Godavari

ఈ వాన ఎప్పుడు ఆగుతుంది:

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షం పడితే చాలు రాష్ట్రంలో ఉన్న వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుంటాయి. అటు గోదావరి నది మాట అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ వర్షాలప్పుడు గోదావరి నదికి (Godavari River) వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. దీంతో 5 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నదిలో వరద నీరు ప్రవాహం చాలా పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏపీ(Andhra Pradesh)లోని ధవళేశ్వరం బ్యారేజీ 13.5 అడుగుల వద్ద ఉంది. అంతేకుండా ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతున్నకొద్ది ప్రమాద హెచ్చరిక నెంబర్లు జారీ చేసే అవకాశం ఉంది. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అటు అధికార యంత్రాంగం కూడా హైఅలర్ట్ అయింది. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(NDRF)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేసింది ఏపీ ప్రభుత్వం.

ఈ వర్షాల కారణంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో వరద పరిస్థితుల దృష్ట్యా సుమారు 200 బోట్లను అధికారులు సిద్దంగా ఉంచారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, గొగుల్ లంక వద్ద ఉధృతంగా వశిష్ట గోదావరి ప్రవహిస్తుంది. లంక గ్రామాల్లో ప్రజలు పర్యటించ వద్దని అధికారులు చెప్పారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగితే లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు.

టెన్షన్‌.. టెన్షన్‌:

గంటగంటకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో కోనసీమలోని లంక గ్రామాల్లోని ప్రజల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఉప్పొంగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్ని లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అటు విలీన మండలాల్లోనూ భారీ వర్షాలకు గోదావరి, శబరి నది పొంగి ప్రవహిస్తోంది. అటు సోకిలేరు వంతెనపై కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు - విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామంలోకి కూడా గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే తాత్కాలిక గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

ఆర్‌టీవీ కథనం ప్రత్యేక ఏర్పాట్లు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక పక్క గోదావరి వరద ఉధృతి, మరోపక్క ప్రమాదకర పడవ ప్రయాణాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధమైన సేఫ్టీ జాకెట్‌లు లేకుండా స్కూల్ విద్యార్థులతో, కూలీలతో గోదావరి ఒడ్డును దాటుతున్నారు. అంతే కాకుండా పడవ నడిపేవారికి సరైన అవగాహన లేకపోతే గోదావరి ఉధృత వడికి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. సుమారు 35 మంది విద్యార్థులును పడవపై ఎక్కించుకుని ఎలాంటి సేప్టీ సైడ్ లైఫ్ జాకెట్లు వేసుకోకుండా పడవ నడుపుతున్నారని నిర్వాహకులపై ప్రజలు మండిపడ్డుతున్నారు. గుత్తెనదీవి, గోగుల్ లంక రేవు వద్దకు చేరుకున్న ఆర్టీవీ(RTV)ప్రయాణాలపై ఆరా తీయగా.. పడవ నిర్వాహకుల ప్రయాణాలను నిలిపేశారు. RTV కథనంతో అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపివేశారు. రెవెన్యూ, ఫిషరీస్, పోలీసు అధికారులు లైఫ్ జాకెట్లుతో ప్రభుత్వం బోట్లు నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని RTVతో చెప్పారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe