మూల్యం చెల్లిస్తారు..టిడిపి నాయకులకు అంబటి వార్నింగ్..!

టిడిపి నాయకులపై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి. ‘‘వచ్చింది బెయిలే.. నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు !’’ అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు.

Andhra Pradesh: పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!
New Update

Minister Ambati Rambabu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu)కు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు బెయిల్ రాయడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

Also read: ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!

అయితే, అధికార పార్టీ వైసీపీ నాయకులు మాత్రం టిడిపి సెలబ్రేషన్స్ పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా, ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సోషల్ మీడియాలో స్పందిస్తూ..విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మాత్రమే వచ్చిందని..ఇంకా ఆయన నిర్దోషిగా విడుదల కాలేదని చెప్పారు. ఇంత మాత్రానికే రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారని మండిపడ్డారు. దీనికి కచ్చితంగా మూల్యం చెల్లిస్తారంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్నారు చంద్రబాబు. అక్టోబర్ 31న అనారోగ్య సమస్యల కారణంగా నాలుగు వరాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా, చంద్రబాబు లాయర్లతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది.

#tdp-chandrababu #ambati-rambabu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe