టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు బంధువులను, డబ్బును వాడుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అంటూ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతే ఎన్నికల ఖర్చులతో పాటు అన్ని ఖర్చులు పెరిగాయని మండిపడ్డారు.
అధికారం కావాలి అనుకుంటే చంద్రబాబు ఎవరితో కలవడానికి అయినా రెడీ. చంద్రబాబే అనుకుంటే ఆయన దత్తపుత్రుడు కూడా అందరితో కలుస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. బాబుని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ నానా గడ్డి తింటున్నాడని ఆయన విమర్శించారు.
ఇప్పటి వరకు ఎక్కడైనా ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వడం చూశారా? అలా అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్ మాత్రమే. మనలో సరుకు ఉంటే ఎక్కడైనా సరే రాణిస్తారని చెప్పుకొచ్చారు. పాదయాత్రలు చేసేవారందరూ ముఖ్యమంత్రులు అయిపోరు. రాజకీయ పరిణితి ఉంటేనే అవుతారని వివరించారు.
''జగన్ కి భయం పరిచయం చేస్తానని లోకేష్ అంటున్నాడు..జగన్ ఒక్కసారి గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకుంటాడని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి పట్టిన శని ఏదైనా ఉంది అంటే అది లోకేషే. లోకేష్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని అన్నారు.