Minister Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్ష్యాలపై విమర్శలు చేస్తు విరుచుకుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ వారాహి వెహికిల్ ఎక్కడ వుంది? చంద్రబాబు రా కదలి రా అంటే.. ఎవరు రావడం లేదని కౌంటర్లు వేశారు. జగన్ సిద్దం సభలు చూశాక.. టీడీపీ నేతల బ్రమలు తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
Also Read: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!
అభివృద్ధిపై చర్చకు రావాలి అంటూ చంద్రబాబు బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారని ఎద్దేవ చేశారు. చంద్రబాబువి దద్దమ్మ సవాళ్లంటూ కామెంట్లు చేశారు. అభివృద్ధిపై చర్చకు నేను సిద్దం అన్నారు మంత్రి అంబటి. చంద్రబాబు కి సవాల్ చేసే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్ లో అయినా చర్చకు సిద్దమని చెప్పుకొచ్చారు. చర్చకు వస్తే, చర్చ అయిన తరువాత బావురుమంటు ఏడవ కూడదని అన్నారు.
Also Read: రాజమండ్రి జనసేన అభ్యర్థి ఇతనే..ఉత్కంఠకు తెరదించిన పవన్ కళ్యాణ్..!
చంద్రబాబునీ ముసలోడు అంటే లోకేష్ కి ఎందుకు అంత కోపం అని ప్రశ్నించారు. చంద్రబాబు జైల్ కి వెళ్తే ముసలోడు అని లోకేష్ అన్నారని గుర్తు చేశారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్, బాబు అంతా గొప్ప వాళ్ళు లేరని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ లోకేష్ దని చురకలు వేశారు. టీడీపీ కుర్చినే లోకేష్ మడత బెట్టబోతున్నారన్నారు. మూడో గుంపు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని..జగన్ నీ సవాల్ చేసే సత్తా నారా వంశానికి, వారహికి లేదని కామెంట్స్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో నీ టీడీపీ అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు.