/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T121938.462.jpg)
Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. జులై 12 న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్- అంబానీ - రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలో అనంత్ - రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది అంబానీ కుంటుంబం. ఇందులో భాగంగా జులై 5 నిన్న సాయంత్రం అంబానీ కల్చరల్ సెంటర్ లో సంగీత్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుక స్టార్ స్టడెడ్ నైట్ గా మారింది. బాలీవుడ్ తారలు కళ్ళు చెదిరేలా ఆకర్షణీయమైన వస్త్రాలంకారణలో వేడుకను మరింత అందాన్ని అద్దారు. పాపులర్ రాప్ సింగర్ బాద్షా, కరణ్ ఔజ్లా, హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ అనంత్ సంగీత్ వేడుకలో మ్యూజిక్, డాన్స్ ప్రదర్శనలతో సందడి చేశారు.
మనవళ్ళు, మానవరాళ్లతో ముఖేష్ - నీతా అంబానీ
అయితే ముఖేష్ అంబానీ తన కొడుకు సంగీత్ లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముఖేష్- నీతా అంబానీ తమ మనవళ్ళు, మానవరాళ్లు పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదలతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. మనవళ్ళు, మానవరాళ్లతో కలిసి షూట్ చేసిన వీడియోను సంగీత్ లో ప్రదర్శించారు. ఇందులో నీతా- ముఖేష్ పిల్లతో కారులో షికారుకు వెళ్తూ సంతోషంగా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో చక్క మీద చక్కా, చక్క మీద గది...' సాంగ్ ప్లే అవుతుండగా నీతా - ముఖేష్ మనవళ్లతో ఆడుకుంటున్న క్షణాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ క్షణాన్ని ప్రత్యేకంగా చేయడానికి కుటుంబ సభ్యులందరూ నృత్య ప్రదర్శన ఇచ్చారు.
View this post on Instagram
Also Read: Ambani Wedding: అంబానీ సంగీత్ లో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మ్యూజికల్ షో ..! - Rtvlive.com