Ambani Wedding: 50 జంటలకు సామూహిక వివాహం.. ముఖేష్ అంబానీ ఇచ్చిన బహుమతులివే..!

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరగనుంది. ఈ శుభకార్యానికి ముందు అంబానీ కుటుంబం 50 మంది పేద జంటలకు సామూహిక వివాహం నిర్వహించింది. ఈ వివాహ వేడుకకు ముఖేష్ అంబానీ తమ కుటుంబ సభ్యులతో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Ambani Wedding: 50 జంటలకు సామూహిక వివాహం.. ముఖేష్ అంబానీ ఇచ్చిన బహుమతులివే..!
New Update

Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ - రాధికా మర్చంట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 12 ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరిద్దరి వివాహ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నేటి నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలుకానున్నాయి.

publive-image

సామూహిక వివాహాలు

అయితే అనంత్- రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో 50కి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వివాహ వేడుకలకు ముఖేష్ అంబానీ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అంబానీ కుటుంబం అంతా కొత్త జంటలను ఆశీర్వదించి అభినందించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ .. 'ఈ జంటలందరినీ ఈ రోజు చూడటం చాలా సంతోషంగా ఉందని. రాబోయే పెళ్లిళ్ల సీజన్లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది పెళ్లిళ్లకు అంబానీ కుటుంబం సపోర్ట్ చేస్తుందని ప్రకటించింది. ఈ శుభ కార్యక్రమంతో అనంత్- రాధికల వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

publive-image

సామూహిక జంటలకు అంబానీ కానుకలు

అంబానీ కుటుంబం తరఫున ప్రతి జంటకు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, పలు బంగారు, వెండి ఆభరణాలను బహూకరించారు. అంతేకాకుండా ప్రతి వధువుకు రూ.1,01,000 చెక్కును 'స్త్రీదానం' కింద అందజేశారు. వీటితో పాటు 36 రకాల నిత్యావసర వస్తువులైన పాత్రలు, గ్యాస్ స్టవ్లు, మిక్సర్లు, పరుపులు, దిండ్లు సహా ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు, ఇతర హోమ్ నీడ్స్ అందజేశారు. అలాగే సామూహిక వివాహానికి హాజరైన వారికి ఘనంగా విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో వార్లీ తెగ వారి సంప్రదాయ తార్పా నృత్యం ప్రదర్శించారు.

publive-image

Also Read: Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..? - Rtvlive.com

#ambani-wedding #ambani-pre-wedding
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి