Ambajipeta Marriage Band : దుమ్మురేపిన అంబాజీపేట..రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లు రాబడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పబ్లిసిటీ కూడా కలిసిరావడంతో..బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.5.16కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం విశేషం.

New Update
Ambajipeta Marriage Band : ఆ ఫేమస్ ఓటీటీలోనే అంబాజీ మ్యారేజీ బ్యాండు..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Ambajipeta Marriage Band : సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తుంటారు. అందుకునిదర్శనమే మొన్న వచ్చిన హనుమాన్..తర్వాత వచ్చిన బేబీ..ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీకి దుశ్యంత్ దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి శివానీ నాగారం హీరోయిన్ గా యాక్ట్ చేసింది పుష్ప జగదీష్, శరణ్ ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ తోనే సత్తా చాటింది అంబాజీపేట.

కాగా ఈ మూవీ కలెక్షన్ల సునామీతో దూసుకుపోతుంది. మొదటిరోజు 2.30కోట్ల గ్రాస్ సాధించంగా..రెండో రోజు కాస్త పెరిగింది. రెండు రోజుల్లో ఈ మూవీ రూ. 5.16కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. సాధారణంగా రెండో రోజు వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమాకు పెరగడం విశేషం. ఈ మూవీకి అభిమానుల్లో పాజిటివ్ టాక్ ఉంది. దీంతో మూడో రోజు ఆదివారం మరింత పెరిగేఛాన్స్ ఉంది. ఆదివారం రోజు చాలా చోట్ల హౌజ్‌ ఫుల్‌ బోర్డులు పడుతున్నాయని సినిమా యూనిట్ తెలిపింది.

ఇది కూడా చదవండి : తాపీ మేస్త్రీకి 4.30లక్షల జీతం..పర్మినెంట్ ఉద్యోగం..అప్లయ్ చేస్తారా?

అటు అమెరికాలోనూ ఇప్పటికే 100కే డాలర్స్ వసూలు చేసింది. ఈ మూవీ ఈజీగా 10కోట్ల కలెక్షన్స్ దాటేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో సుహాస్ సూపర్ డూపర్ హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు.

Advertisment
తాజా కథనాలు