/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Amazon-Prime-Day-Sale-.jpg)
నిన్న ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు మిడ్ నైట్ తో ముగియనుంది. మీరు తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Realme Narzo 70x 5G స్మార్ట్ ఫోన్ పై ఈ ఫోన్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. Realme యొక్క ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 17,999. అయితే.. సేల్ లో రూ.4500 తగ్గింపుతో ఈ ఫోన్ రూ.13,499కు అందుబాటులో ఉంది. సేల్ లో అందుబాటులో ఉన్న వివిధ బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుంటే ఈ ఫోన్ ను కేవలం రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:Amazon Offers: వన్ ప్లస్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.5,000 డిస్కౌంట్..!
అదిరే ఫీచర్లు..
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Realme యొక్క కొత్త ఫోన్ నార్జో స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల పూర్తి-HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ 128 జీబీ కాగా.. 2TB వరకు విస్తరించుకోవచ్చు.
ఈ ఫోన్లో 6GB RAM ఉంటుంది. ఇది డైనమిక్ ర్యామ్ ఫీచర్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0లో మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, రెండేళ్ల OS అప్‌డేట్‌లతో పనిచేస్తుంది. పవర్ కోసం, ఈ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ బరువు 188 గ్రాములు.
Realme Realme Narzo 70x 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించబడింది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 5G, Wi-Fi, బ్లూటూత్ 5.2 అందించారు. సెక్యూరిట కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఈ ఫోన్లో అందించారు. ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కొనాలన్నది మీ ప్లాన్ అయితే.. ఈ ఫోన్ ను కొనేయండి.