ఇ-కామర్స్ కంపెనీల స్పెషల్ సేల్స్ ఇటీవల చాలా వరకు తగ్గిపోయాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే డీల్స్ సందడి ఈమధ్య కనిపించట్లేదు. అయితే ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఈ వేసవిలో స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024’ను (Amazon Great Summer Sale 2024) తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ కస్టమర్లకు వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు అందించనుంది. సేల్ నిర్వహించే తేదీలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే కొన్ని బెస్ట్ డీల్స్ గురించి స్నీక్ పీక్స్ రివీల్ చేసింది.
ఈ సేల్‌లో అమెజాన్ శామ్‌సంగ్ గెలాక్సీ M34, శామ్‌సంగ్ గెలాక్సీ S23, గెలాక్సీ S24, రెడ్‌మీ 13C (Redmi 13C), రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), షియోమి 14, ఐక్యూ Z9, టెక్నో పోవా 6 ప్రో వంటి డివైజ్‌లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు రివీల్ చేసింది. అయితే ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ ఉంటుందో స్పష్టంగా వెల్లడించలేదు.అమెజాన్ టీజర్ పేజీ ప్రకారం, గ్రేట్ సమ్మర్ సేల్‌లో వివిధ ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. కంపెనీ ‘బెస్డ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’తో టెక్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3), వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ నార్డ్ CE 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్ 12R (OnePlus 12R) వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు అమెజాన్ కన్ఫామ్ చేసింది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో అమెజాన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చాకే డీల్స్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఐఫోన్ మోడల్స్‌పై అందించే ఆఫర్లపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు పాత తరం ఐఫోన్లపై కూడా అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.ఈ సేల్‌లో అమెజాన్ వన్‌కార్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్లకు ఆకర్షణీయమైన EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లపై మరిన్ని డిస్కౌంట్లు ఉంటాయి. సాధారణ ప్రజల కంటే ప్రైమ్ మెంబర్స్‌కు సేల్ ఒక రోజు ముందుగానే స్టార్ట్ అవుతుంది. దీంతో వీరు స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ముందే యాక్సెస్ చేసుకోవచ్చు.
అమెజాన్ అతి త్వరలో గ్రేట్ సమ్మర్ సేల్ నిర్వహించే తేదీలను రివీల్ చేయనుంది. ఇప్పటికే టీజర్ కూడా రావడంతో, ఈ డీల్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత స్పెషల్ సేల్ వస్తున్న నేపథ్యంలో, కస్టమర్ల రెస్పాన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండవచ్చని కంపెనీ భావిస్తోంది.