Amazon Offers: అమేజాన్‌లో ఆఫర్ల జాతర.. ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్స్..

ఆఫర్ల జాతర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? అయితే, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సమయం రానే వచ్చింది.. తేదీ రానే ప్రకటించేశారు.. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివిల్ సేల్ మరికొద్ది రోజుల్లో లైవ్‌లోకి రానుంది. అవును, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమేజాన్‌.. తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రకటించింది.

Amazon Offers: అమేజాన్‌లో ఆఫర్ల జాతర.. ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్స్..
New Update

Amazon Great Indian Festival Sale Date: ఆఫర్ల జాతర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? అయితే, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సమయం రానే వచ్చింది.. తేదీ రానే ప్రకటించేశారు.. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివిల్ సేల్ మరికొద్ది రోజుల్లో లైవ్‌లోకి రానుంది. అవును, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమేజాన్‌.. తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రకటించింది. భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. దాదాపు 75 శాతి డిస్కౌంట్స్ ప్రకటించింది. కొత్త ఫోన్, టీవీ, ఏసీ, ఏదైనా కొత్తి ప్రోడక్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. లిస్ట్ రెడీ చేసుకోండి. ఈ భారీ ఆఫర్స్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

75 శాతం తగ్గింపు..

అమెజాన్ సేల్ సమయంలో కస్టమర్లు మొబైల్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపును పొందుతారు. అంతేకాకుండా నెలకు రూ. 840 ప్రారంభ నో కాస్ట్ EMI, రూ. 60 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ధర ప్రకటించింది అమేజాన్. లాప్‌టాప్‌లపై రూ.40,000 వరకు తగ్గించగా.. హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపును, టాబ్లెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది అమేజాన్.

స్మార్ట్ LED టీవీ, గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. అలాగే, ఫ్రిజ్‌ని కొనుగోలు చేసేటప్పుడు పాత ఫ్రిజ్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. రూ. 17,000 వరకు తగ్గింపును ప్రకటించింది. టీవీని కొనుగోలు చేసేటప్పుడు రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపునిచ్చింది. వాషింగ్ మెషీన్లు, టీవీలపై 55 శాతం తగ్గింపును ప్రకటించింది. ఇక 24 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనం పొందవచ్చు.

Alexa పరికరాల కొనుగోలుపై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది అమేజాన్. Fire TVపై 55 శాతం వరకు తగ్గింపు, Kindle పరికరాలపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రోడక్ట్స్ ధరల తగ్గింపులు మాత్రమే కాకుండా బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా కూడా పొదుపు చేయవచ్చు.

సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్‌తో కొనుగోలు చేయడం ద్వారా..

Amazon SBI బ్యాంక్ ఫర్ సేల్ 2023తో చేతులు కలిపింది. ఈ సేల్ సమయంలో షాపింగ్ చేసేటప్పుడు SBI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లిస్తే.. 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read:

RTV Bramhanandam Interview: రంగమార్తాండ కోసం మూడు రోజులు ఉపవాసం.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్

Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే..

#amazon-offers #amazon-great-indian-festival-sale #amazon-great-indian-festival-sale-date
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe