అమెజాన్ లో మరోసారి లే ఆఫ్స్‌..ఈసారి ఎంతమందంటే?

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మరోసారి లే ఆఫ్‌ ప్రకటించింది. తన గేమింగ్‌ డివిజన్‌ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Amazon Mega Electronics Days Sale: అమెజాన్లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్.. ఈ వస్తువులపై ఊహించని డిస్కౌంట్లు!
New Update

అమెజాన్ మరోసారి తన ఉద్యోగులను తొలగించింది. కరోనా తరువాత ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అమెజాన్‌ పలుమార్లు తన కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ఈ క్రమంలోనే మరోసారి అమెజాన్‌ తన కంపెనీ ఉద్యోగులకు బైబై చెప్పింది.

తన గేమింగ్‌ డివిజన్‌ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి నవంబర్‌ 13న అధికారిక మెయిల్‌ పంపింది. ఈ విషయం గురించి అమెజాన్‌ గేమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టోఫ్‌ హార్ట్‌మన్‌ దీని గురించి వివరించారు. మా వ్యాపారాన్ని ముందుకు నడిపించడం కోసమే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మా కస్టమర్లకు ఏం కావాలో మాకు తెలుసు. వారు మా వద్ద నుంచి ఎప్పుడూ కూడా ఎక్కువగా కోరుకుంటున్నారు.

అందుకే మా సంస్థను మరింత మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సోమవారం నుంచి అమెజాన్‌ తన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.అమెజాన్‌ నుంచి ఈ ఏడాది ఇది రెండో లే ఆఫ్‌ రౌండ్‌. గత వారంలో కూడా కొంత మంది ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇక గ‌త ఏడాది ఆర్ధిక మాంద్య భ‌యాలు, మంద‌గ‌మ‌నం వెంటాడ‌టంతో అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది.ఇక గ‌త ఏడాది ఆర్ధిక మాంద్య భ‌యాలు, మంద‌గ‌మ‌నం వెంటాడ‌టంతో అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది.

Also read: చచ్చేంత వరకు జగన్‌ వెంటే: అంబటి రాంబాబు!

#amazon #employees #layoffs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe