మెంతులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..

మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి.అయితే మరికొన్ని ప్రయోజనాలు మెంతులతో సాధ్యం అవేంటంటే..

New Update
మెంతులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..

మెంతుల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల గ్లూకోజ్ ఉత్పత్తి అదుపులోకి వస్తుంది. ఫలితంగా షుగర్ పేషెంట్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ కంట్రోల్ అవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో మెంతులు మంచి ఫలితాలను ఇస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి కిడ్నీలు దెబ్బతినకుండా, కార్డియోవాస్కులర్ వ్యాధుల బారిన పడకుండా, డయాబెటిక్ న్యూరోపతి వంటి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడగలవు.మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. మలబద్దకాన్ని నివారించే లక్షణాలు వీటిలో ఉంటాయి. దీంతో ఎసిడిటీ నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వీటిని నానబెట్టి తింటే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు తల్లి పాల ఉత్పత్తిని పెంచగలవు. మెంతి నీరు లేదా మెంతి టీ తాగిన బాలింతలకు పాల ఉత్పత్తి పెరిగినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో వారి పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.మెంతి గింజల్లో ఉండే సోపోనిన్స్, రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించగలవు. ఇవి చెడు కొవ్వును తగ్గిస్తూ మంచి కొవ్వును పెంచేందుకు తోడ్పడతాయి. దీంతో గుండె వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లను మెంతులు తగ్గించగలవు. ఇందులోని కాంపౌండ్లు నొప్పిని నివారించగలవు. పీరియడ్స్ పెయిన్స్ ఎక్కువగా ఉంటే, మెంతి పొడిని నీటిలో కలిపి తాగడం మంచిది. దీనివల్ల మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది.మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయులను మెంతి గింజల్లోని సమ్మేళనాలు పెంచగలవు. 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. వీర్య కణాల వృద్ధికి, మానసిక ప్రశాంతతకు మెంతులు తోడ్పడతాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు