Joint Pain: కీళ్ల నొప్పులకు అద్భుత ఆహారం.. తింటే పరుగెత్తడం ఖాయం ప్రస్తుతం వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు ఒకటి. ఎక్కువగా కూర్చొవటం, పోషకాల ఆహారం, వ్యాయామం, ఊబకాయం వల్ల కీళ్ల నొప్పులతోపాటు నడుం, మెడ నొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పులు తగ్గించే మరో వంటకం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Joint Pain: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. ఒకప్పుడు 45 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఉంటోంది. అధిక సమయం కూర్చొని ఉండటం, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, అలాగే సరిగా వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం వల్ల కీళ్ల నొప్పులతో పాటు నడుం, మెడ నొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పులకు మరో రీజన్ క్యాల్షియం తగినంత లేకపోవడం. క్యాల్షియం లేకపోతే ఎముకలు బలహీన పడతాయి. చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతుంటాయి. క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. పెరుగు, అటుకులలు కలిపి తింటే కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ముందుగా బాండీలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా వేడిచేయాలి. అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు, మునగాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు వేసుకుని వేచించిన తర్వాత ముందుగా నానబెట్టిన అటుకులను వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు కలపాలి. అటుకులు వేగాక పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు కలుపుతూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు తగ్గించే మరో వంటకం: ముందుగా ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మునగాకు, కరివేపాకు, అల్లం ముక్కలు పసుపు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత టమాటా, క్యారెట్, ఉప్పు వేసి బాగా వేయించాలి. నానబెట్టిన అటుకులతో పాటు నీళ్లు వేసి కలిపి, ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర చల్లి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా చదవండి: రోజుకు ఒకటి తింటే శరీరం ఉక్కులా మారుతుంది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #joint-pain #best-foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి