Google Maps: మాల్స్ లో పార్క్ చేసిన కారును గుర్తించే అద్భుత ఫీచర్..ఇదే..!!

పెద్ద పెద్ద మాల్స్ లో పార్క్ చేసిన మీకు కారు ఎక్కడుందో గుర్తించలేకపోతున్నారా? గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీ కారు లేదా బైక్ ను ఈజీగా కనిపెట్టవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవండి.

New Update
Google Maps: మాల్స్ లో పార్క్ చేసిన కారును గుర్తించే అద్భుత ఫీచర్..ఇదే..!!

షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ చేస్తుంటాం. షాపింగ్ అంతా ముగించుకుని వచ్చాక కారు ఎక్కడుందో గుర్తించడం కష్టంగా మారుతుంది. కేవలం షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడే కాదు..సైట్ సీయింగ్, సినిమాలకు వెళ్లినప్పుడు ఇలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేస్తుంటాం. మన పని ముగించుకుని వచ్చి కారు ఎక్కడ ఉందని చాలా సార్లు వెతుకుతుంటాం. కొన్ని సందర్భాల్లో గంటల సమయం పడుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పార్కింగ్ చేసిన కారు లేదా బైక్ లను గుర్తించేందుకు google maps, google assiasant ద్వారా మన కారు ఎక్కడ ఉందో సులభంగా కనిపెట్టవచ్చు. ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీ మొబైల్ లో ఇవి ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి:
-మీరు ముందుగా మీ మొబైల్ లోని గూగుల్ మ్యాప్స్, గూగుల్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.
-ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయి మార్షాల్హ లేదా కొత్తది, యాపిల్ వినియోగదారులు ఐఓఎస్ 10 లేదా కొత్త వెర్షన్లు ఉండాలి.
-ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ సర్వీస్, గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటాయి.

మీ కారు లేదా బైక్ లొకేషన్ ను సేవ్ చేసుకోవాలి:
ఇప్పుడు మీ బైక్ కానీ కారు కానీ పార్కింగ్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ వెహికల్ పార్కింగ్ చేసిన స్థలాన్ని సూచించే బ్లా పిన్ ను నొక్కాలి. ఇప్పుడు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో సేవ్ యువర్ పార్కింగ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. కారు ఫొటోలు, పార్కింగ్ నెంబర్లను కూడా సేవ్ చేసుకోవాలి. అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించి నేను ఎక్కడ పార్క్ చేశానో గుర్తుంచుకో అని చెబితే మీ పార్కింగ్ స్థలాన్ని ఈజీగా గుర్తించుకుంటుంది.

పార్కింగ్ లో వెహికల్ ను ఎలా గుర్తించాలి?
మీ కారు లేదా బైక్ ను గుర్తించాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఒపెన్ చేసి సేవ్ చేసిన పార్కింగ్ పై క్లిక్ చేయాలి. నావిగేషన్ను యాక్టివేట్ చేయడానికి డైరెక్షన్లపై నొక్కాలి. లేదా గూగుల్ అసిస్టెంట్ నా కారు ఎక్కడుందని అడిగితే మీ కారు పార్కింగ్ ప్రాంతానికి దారి చూపిస్తుంది.

ఇలా గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించి మీ కారును పార్కింగ్ చేయడం తర్వాత వాటి స్థలాన్ని గుర్తించడం ద్వారా సమయం, శక్తి రెండింటినీ ఆదా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్…ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!!

Advertisment
తాజా కథనాలు