Heltha Benefits: ఎండుద్రాక్షలో విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామూలు నీళ్లు తాగ కుండా ఎండుద్రాక్ష నీళ్లు తాగేవాళ్లు చాలామందే ఉన్నారు. ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల పొట్టను శుభ్రపరచడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయటంతోపాటు శరీరంలోని మురికిని తొలగిస్తుంది. ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
మీరు ఇంట్లోనే ఎండుద్రాక్ష నీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎండుద్రాక్ష నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎండుద్రాక్షనీటి తాయారీ విధానం:
- ఇది ఒక రకమైన డిటాక్స్ డ్రింక్. దీన్ని చేయడానికి.. మీరు ఒక కంటైనర్ తీసుకోవాలి. దానిలో నీరు పోసి ఎండుద్రాక్ష శుభ్రంచేసి వాటిని కలపాలి.
- ఎండుద్రాక్ష నీరు రెండింటినీ చాలా ఎక్కువగా ఉంచాలి. ఎండుద్రాక్ష పూర్తిగా నీటిలో నానబెట్టాలి. కూజా లేదా కంటైనర్‌ను మూతతో గట్టిగా కప్పాలి. రాత్రంతా అంటే 8 గంటలు వదిలేయాలి.
- ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు మీరు ఒక వారంలోనే దాని ప్రయోజనాలు చూస్తారు.
- ఎండుద్రాక్ష నీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తాగితే రక్తహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సమస్యలు, పసుపు చర్మం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సాయంత్రం ఏడు గంటల లోపు ఈ పని చేయండి.. బరువు తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే!