Black Turmeric: పసుపులో చాలా ఔషధ గుణాలుంటాయి. ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. నిత్యం వంటల్లో పసుపు వేస్తూ ఉంటాం. కేవలం వంటలకు రుచి ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నల్లపసుపు గురించి విన్నారా..?.. ఇది సాధారణ పసుపు కంటే ఎక్కువ రెట్లు కర్‌క్యుమిన్ (Curcumin) కంటెంట్ కలిగి ఉంటుంది. పేరుకే నలుపు కానీ ఇది ఊదా రంగులో ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఎక్కువగా ఈ నల్ల పసుపును సాగు చేస్తారు. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా (Curcuma Caesia). ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఇది ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. నల్ల పసుపును యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నిలయంగా చెబుతారు. గాయాలు, దెబ్బల కారణంగా మన శరీరంలో వచ్చిన వాపును తగ్గిస్తుంది. అలాగే కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది:
- ఈ నల్ల పసుపులో ఉండే కర్కుమినాయిడ్స్ రోగనిరోధక కణాలను ప్రేరేపిస్తుంది. అంటువ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినుంచి మనల్ని కాపాడుతుంది. వైరస్లు, ఫంగస్‌లు, వివిధ రకాల బ్యాక్టీరియాలను సమర్థవంతంగా అరికడుతుంది.
జీర్ణక్రియ:
- నల్ల పసుపు (Black Turmeric) వల్ల జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. అంతేకాకుండా అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి.
షుగర్ కంట్రోల్:
- మన రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారు దీన్ని వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
చర్మానికి బెస్ట్:
- వివిధ చర్మ సమస్యలకు ఈ నల్లపసుపు అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలతో పాటు తామర, మచ్చలను పోగొడుతుంది.
జ్ఞాపక శక్తి:
- ఈ నల్ల పసుపులో కర్కుమిన్ ఎక్కువగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్‌ను కూడా నివారిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులను బాగా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: పారిపోయి వచ్చే ప్రేమికుల కోసమే ఉన్న ఈ ఆలయం గురించి తెలుసా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.