Amarnath Yatra: అమర్నాథ్ వెళ్లాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న భక్తులకు అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈసారి యాత్ర ఆషాఢ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి సందర్భంగా ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 2:19 గంటలకు మొదలవుతుందని బోర్డు చెప్పింది. ఆగస్ట్ 19వ తేదీ వరకు యాత్ర ఉంటుందని అధికారులు అన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ఉంటాయని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. భక్తులు సహజమైన శివ లింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ఉండనున్నాయి. www.jksasb.nic.inలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకోవచ్చు. మంచురూపంలో ఉండే శివయ్యను దర్శించుకునేందుకు దేశనలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న గుహలో ఈ మంచులింగం ఏర్పడనుంది. భక్తుల భద్రతపై జమ్మూకశ్మీర్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల మధ్య వయసువారే యాత్రకు రావాలని సూచిస్తున్నారు. 6 నెలలకుపైగా గర్భంతో ఉన్న మహిళలు యాత్ర చేయొద్దని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్