/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Amarnath-Yatris-can-register-from-April-15-1-jpg.webp)
Amarnath Yatra : అమర్నాథ్ (Amarnath) యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ (Online Helicopter Booking) సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్‌లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేస్తుందని వారు పేర్కొన్నారు.
యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుండి ప్రారంభమైంది. లాంగర్ ఆర్గనైజింగ్ కమిటీలు (Longer Organizing Committees) జూన్ 15 న వస్తువులతో కూడిన ట్రక్కులతో జమ్మూ మరియు కాశ్మీర్‌లో (Jammu & Kashmir) ‘లంగర్’ (కమ్యూనిటీ కిచెన్) ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి అనేక స్థలాలను గుర్తించారు. ఈ సంవత్సరం, పవిత్ర గుహ వరకు 125 లంగర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది.