Amarnath : పవిత్ర గుహకు బయలుదేరిన భక్తులు.. బాం-బం-భోలే నామస్మరణతో మారుమోగుతున్న అమర్‌నాథ్!

అమర్‌నాథ్ గుహను సందర్శించేందుకు ఫస్ట్‌ బ్యాచ్ బాల్తాల్ నుంచి బయలుదేరింది. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ తప్పనిసరి చేశారు.

New Update
Amarnath : పవిత్ర గుహకు బయలుదేరిన భక్తులు.. బాం-బం-భోలే నామస్మరణతో మారుమోగుతున్న అమర్‌నాథ్!

Amarnath Yatra :జమ్మూ అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బేస్ క్యాంపు నుంచి బయలుదేరారు. అమర్‌నాథ్ (Amarnath) పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల సౌకర్యాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు (Terrorists Attack) జరిపారు. ఆ తర్వాత బస్సు కాలువలో బోల్తా పడింది. ఈ దారుణ ఘటనలో 9మంది భక్తులు చనిపోయారు. దీంతో అమర్‌నాథ్ యాత్రకు ప్రతీసారి కంటే ఎక్కువగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులు బాబా భక్తిలో మునిగిపోయారు. తమకు ఎలాంటి భయం, ప్రయాణికులంతా నినదిస్తున్నారు. యాత్రికుల్లో చాలామంది ఏళ్ల తరబడి అమర్‌నాథ్ యాత్ర చేస్తున్నారు.


బాం-బం భోలే అనే మంత్రోచ్ఛారణలతో భక్తులు శివుడి దర్శనం చేసుకుంటున్నారు. పవిత్ర అమర్‌నాథ్ గుహను సందర్శించేందుకు మొదటి బ్యాచ్ యాత్రికులు బాల్తాల్ నుంచి బయలుదేరారు. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. అంతకముందు ఖాజిగుండ్‌లోని నవియుగ్ టన్నెల్ మీదుగా బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు వచ్చారు. ముందుగా ఉధంపూర్‌లోని తిక్రీలోని కాళీమాత ఆలయానికి వెళ్లారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన శివభక్తుల్లో అశేషమైన ఉత్సాహం కనిపిస్తోంది.

ఆ కార్డు తప్పనిసరి:
భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కార్డ్ తప్పనిసరి. ఇది లేకుండా ప్రయాణీకులెవరూ ముందుకు వెళ్లడానికి అనుమతించరు. బాల్తాల్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఒక్కరోజులో దర్శనం తర్వాత తిరిగి వస్తారు. ఇక చాలా మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఇష్టపడతారు. ఈసారి 52 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఆగస్ట్ 19 వరకు భక్తులు శివుడిని దర్శనం చేసుకోవచ్చు.

Also Read: చోకర్స్‌ వర్సెస్‌ చోకర్స్‌.. ఎవరు ఓడినా గోలే..!

Advertisment
తాజా కథనాలు