amaravathi: సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటర్

హైకోర్టులో సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ను భారతిపైకి పిలిచి నట్లు తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా నమోదు చేసిందని అజేయకల్లం పిటిషన్‌లో పేర్కొన్నారు. .

New Update
amaravathi: సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటర్

హైకోర్టులో కౌంటర్

హైకోర్టులో సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ను భారతిపైకి పిలిచి నట్లు తాను చెప్పినట్లు సీబీఐ తప్పుగా నమోదు చేసిందని అజేయకల్లం పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ అజయ్ కల్లం విచారణ ఆడియో రికార్డింగ్‌ చేసినట్లు వెల్లడించిన సీబీఐ. అజయ్ కల్లం విచారణ ఆడియో రికార్డింగ్ సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది సీబీఐ. సీఎం జగన్ సలహాదారు అజేయకల్లం తీరుపై అసహనం వ్యక్తం చేసింది సీబీఐ.

ఇరికించే ప్రయత్నం

ప్రస్తుతం, వాంగ్మూలం నమోదు చేసినప్పుడు అజేయకల్లం సీఎం ప్రధాన సలహాదారుడుగా ఉన్నారని సీబీఐ వెల్లడించింది. అజేయకల్లం ఏపీ సీఎం ప్రధాన సలహాదారుడు కాబట్టి పిటిషన్‌లో అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో అనుబంధాన్ని అజేయకల్లం కూడా పిటిషన్‌లో ఒప్పుకుంటున్నారని స్పష్టంగా చేసింది. అజేయకల్లం ప్రభావితమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని సీబీఐ అన్నది. పిటిషన్‌లో అజేయ కల్లం పేర్కొన్నఅంశాలు.. "తర్వాత వచ్చిన ఆలోచనలే" అందుకే తర్వాత వచ్చిన ఆలోచనలతో అజేయ కల్లం వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నారని వెల్లడించారు. తన వాంగ్మూలంతో కొందరిని ఇరికించే ప్రయత్నమన్న అజేయకల్లం ఆరోపణలు ప్రేరేపితం, కల్పితం అని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్య కేసులో స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేశాం. అజేయకల్లంతో పాటు పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని సీబీఐ వివరించింది. వివేకా హత్యలో అమాయకులను ఇరికించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదని సీబీఐ స్పష్టం చేసింది.

అజేయకల్లం ఆరోపణలు అబద్ధం

వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది. అజేయకల్లం అంగీకారంతోనే ఆయన ఇంట్లోనే ఏప్రిల్ 24న వాంగ్మూలం నమోదు చేశాం సీబీఐ అధికారులు తెలిపారు.వివేకా హత్య కేసులో అజేయకల్లంను సాక్షిగా విచారణ జరిపామన్నారు. చట్టప్రకారమే వాంగ్మూలం నమోదు చేసి అజేయకల్లంకు చదివి వివరించామని సీబీఐ తెలిపింది. అజేయకల్లం చెప్పిన ప్రతీ అక్షరం నమోదు చేశామన్నారు. వాంగ్మూలంలో అవసరమైన చోట కొన్ని సవరణలు కూడా చేయమన్నారు. వాంగ్మూలంలో వాస్తవాలు నమోదు చేసినట్లు అజేయకల్లం సంతృప్తి చెందారు సీబీఐ పేర్కొంది. ఐఏఎస్‌గా రిటైరైన అజేయకల్లంకు సీఆర్‌పీసీ 161 వాంగ్మూలం ఉద్దేశమేంటో తెలుసు. దర్యాప్తు అధికారిపై అజేయకల్లం ఆరోపణలు అబద్ధమని సీబీఐ తెలిపింది. కేసు ప్రాసిక్యూషన్‌ను దెబ్బతీసే దురుద్దేశంతో అజేయకల్లం పిటిషన్ వేశారని సీబీఐ తెలిపింది.

అజయకల్లం బాధ్యత వహించాలి

ఇతర సాక్షుల్లో అనుమానాలు రేకెత్తించేలా అజేయకల్లం ప్రయత్నిస్తున్నారు. మాజీ సీనియర్ బ్యూరోకాట్‌గా దర్యాప్తు, న్యాయవ్యవస్థపై అజేయకల్లంకు విశ్వాసం ఉండాలన్నారు. నేర న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు అజేయకల్లం ప్రయత్నిస్తున్నారు. మాజీ సీనియర్ బ్యూరోకాటైన అజేయకల్లం నుంచి సీబీఐపై ఇలాంటి ఆరోపణలు ఊహించలేదని సీబీఐ అన్నది. సీబీఐ ప్రతిష్ట, కేసు ప్రాసిక్యూషన్‌ను దెబ్బతీసేందుకు అజేయకల్లం ప్రయత్మిస్తున్నారు. ట్రయల్ సమయంలో కోర్టులో అజేయకల్లం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు అన్నారు. ట్రయల్‌కు ముందే ఇలాంటి ఆరోపణలతో పిటిషన్ వేసేందుకు ఇది తగిన సమయం కాదు. ట్రయల్ సమయంలో అజేయకల్లంను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ధిక్కార స్వభావానికి పరిణామాలకు అజేయకల్లం బాధ్యత వహించాల్సి ఉంటుంది. తన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డుల నుంచి తొలగించాలనడం ప్రాసిక్యూషన్‌ను పక్కదారి పట్టించడమే అని సీబీఐ పేర్కొంది. విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారే వెనక్కి తగ్గితే మిగతా సామాన్య సాక్షుల పరిస్థితేంటి..?: సీబీఐ ప్రశ్నించింది. నిందితుల తీవ్ర ప్రభామున్న ప్రాంతానికి చెందిన సాధారణ సాక్షుల పరిస్థితి ఏమిటి..? ట్రయల్‌కు ముందే రాజ్యంగ కోర్టుల్లో సాక్షులు వెనక్కి తగ్గితే క్రిమినల్ జస్టిస్ సిస్టం అపహాస్యమవుతుందని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు