Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే!

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన అమన్ సెహ్రావత్ ఒక అనాథ. 11ఏళ్ల వయసులోనే పేరెంట్స్‌ను కోల్పోయి ఎన్నో కష్టాలపాలయ్యాడు. అయినా పట్టు వదలని ఈ మల్లయోధుడు ఒలింపిక్ పతకం సాధించి పేరెంట్స్ కల నెరవేర్చడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

New Update
Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే!

Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్‌ 2024 రెజ్లింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియా ఆటగాడు అమన్ సెహ్రావత్ ఒక అనాథ. ఊహ తెలుస్తున్న 11 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా పట్టు వదలని ఈ మల్ల యోధుడు తన జీవితంలో అన్ని అసమానతలను ధిక్కరించి ఒలింపిక్ పతక విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. అంతేకాదు 2024 పారిస్ ఒలింపిక్స్ లో (Paris Olympics) 21ఏళ్లకే ఇండియాకు మెడల్ సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ చరిత్ర సృష్టించాడు.

అతిపిన్న వయస్కుడిగా రికార్డు.. 
ఈ మేరకు రియో ఒలింపిక్స్ 2016లో 21 సంవత్సరాల 1 నెల 14 రోజుల వయస్సులోనే రజతం గెలిచిన పివి సింధు రికార్డును (PV Sindhu Record) ఈ యువ రెజ్లర్ బద్దలు కొట్టాడు. అమన్ 21 సంవత్సరాల 0 నెలల 24 రోజుల వయసులోనే ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. అయితే తన కాంస్య పతకాన్ని తల్లితండ్రులు, దేశానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. 'నా పేరెంట్స్ నా కోసం కన్న కలలు ఇవి. వాళ్లు ఎల్లప్పుడూ నన్ను రెజ్లర్‌గా చూడాలని కోరుకున్నారు. వారికి ఒలింపిక్స్ గురించి ఏమీ తెలియదు. కానీ నేను రెజ్లర్‌ని కావాలని వారు కలలు కన్నారు. ఈ విజయంతో వారికి నివాళి అర్పిస్తున్నా' అంటూ అమన్ భావోద్వేగానికి లోనయ్యాడు.

publive-image

కెరీర్ మలుపు తిప్పిన 2022..
అమన్ (Aman Sehrawat) కెరీర్ 2022 సంవత్సరంలో కీలక మలుపు తిరిగింది. అతను ఆసియా U20 ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా U23 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటికీ అమన్ కు కేవలం 11 సంవత్సరాలే. కాగా ఆ తర్వాత పేరెంట్స్ చనిపోవడంతో అనాథగా మిగిలిన అమన్ కుస్తీలో శూన్యం మిగిలిపోయింది. అతని తండ్రి అకాల మరణానికి ముందు అమన్‌ను 2013లో ఛత్రసల్ స్టేడియంలో చేర్చాడు. తనకు తెలియకుండానే కొడుకు ఒలింపిక్ గెలిచేందుకు పునదులు వేశాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పునియా, రవి దహియాలలో ఇప్పటికే నలుగురు ఒలింపిక్ పతక విజేతలను అందించిన ఈ స్టేడియం అమన్‌కు రెండవ ఇల్లుగా మారింది. ఇది అతనికి కేవలం ఆశ్రయం మాత్రమే కాదు తన జీవితాన్ని తీర్చిదిద్దే దేవాలయంగా భావించాడు. ఈ క్రమంలోనే మాజీ ఛాంపియన్‌లతో శిక్షణ చేయడం అతని కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా సుశీల్ కుమార్ చూపించిన చొరవ అమన్ జీవితాన్ని మార్చేసిందని, రవి దహియాతోనూ అమన్ విడదీయలేని అనుబంధాన్ని కలిగివున్నట్లు అమన్ తరచూ చెబుతుంటాడు.

Aman Sehrawat2

ఇది కూడా చదవండి: Bandi Sanjay : కవిత బెయిల్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ముక్కు నుండి రక్తం కారుతున్న..
భారతదేశం నుంచి ఈ సారి ఏకైక పురుష రెజ్లర్‌గా పారిస్‌కు చేరుకున్న అమన్‌పై చాలా ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అతను మొదట చాంప్ డి మార్స్ ఎరీనాలో జరిగిన కాంస్య ప్లే-ఆఫ్‌లో ప్యూర్టో రికన్ డారియన్ టోయ్ క్రూజ్‌ను 13-5తో ఓడించడంతో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పటికీ అమన్ వెనకడుగే వేయకుండా ఒలింపిక్ పోడియంపై అటాకింగ్ గేమ్ ఆడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎట్టకేలకు 2024 ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున పోటీపడ్డ ఏకైక పురుష రెజ్లర్‌ అమన్‌ ఆశలు రేపి సెమీస్‌లో భంగపడ్డప్పటికీ కాంస్య పతక పోరులో విజయం సాధించి పతకం తీసుకొచ్చాడు. అమన్ జీవితం భవిష్యత్తు తరాలకు ఎంతో ఆదర్శం అంటూ క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు