Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్‌!

పారిస్‌ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు.

New Update
Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్‌!

Aman Lost Above 4Kgs In 10Hrs : పారిస్‌ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ (Vinesh Phogat) పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌ (Aman Sherawat) విషయంలో మేనేజ్‌మెంట్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కాంస్య పోరు కోసం బరిలోకి దిగిన అమన్‌ ..తన బరువు పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు రెజ్లింగ్‌ వర్గాలు తెలిపాయి. సెమీస్‌ లో ఓటమి తరువాత గత గురువారం అమన్‌ బరువు 61.5 కేజీలు ఉన్నాడు. దీంతో శుక్రవారం రాత్రికి 57 కేజీలకు వచ్చేందుకు చాలా కఠినంగా శ్రమించాడు.

కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. దాని కోసం సీనియర్‌ కోచ్‌ లు జగమందర్‌ సింగ్‌, వీరేందర్‌ దహియాతో పాటు మరో ఆరుగురు బృందం చాలా కష్టపడింది. దానిని ఓ మిషన్‌ లా తీసుకొని పని చేశారు. గురువారం రాత్రి 6.30 గంటలకు అమన్‌ సెమీస్‌ లో తలపడ్డాడు. ఆ బౌట్‌ లో ఓటమిని చవిచూశాడు.

దీంతో కాంస్య పోరులో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకు శుక్రవారం అమన్‌ బరువును తూచారు. సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉంది. భారత బృందం అమన్‌ ను గంటపాటు వేడినీళ్ల స్నానం ఆగకుండా..గంటసేపు ట్రెడ్‌ మిల్‌ పై రన్నింగ్‌ చేయించి జిమ్‌ కు తీసుకుని వెళ్లారు.

అక్కడ చాలా కష్టతరమైన కసరత్తులు చేయించారు. మళ్లీ 30 నిమిషాల బ్రేక్‌ ఇచ్చి...దాదాపు ఐదు సెషన్ల పాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్‌ చేయించారు. చివరి సెషన్‌ నాటికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కోచ్‌ లు గుర్తించారు. దీంతో నెమ్మదిగా జాగింగ్‌ చేయమని అమన్‌ కు సూచించారు.

దాదాపు ఇలా 15 నిమిషాల పాటు చేయించారు. అప్పుడు శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయం.అప్పటికీ 56.9 కేజీలకు చేరాడు. భారత బృందం దీంతో ఊపిరిపీల్చుకుంది. ఈ సమయంలో నిద్ర కూడా పోలేదని అమన్‌ తెలిపాడు. రెజ్లింగ్‌ కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయినట్లు తెలిపారు. ఒలింపిక్స్‌ లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయసు భారత అథ్లేట్‌ గా అమన్‌ చరిత్ర సృష్టించాడు.

Also read: విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత!

Advertisment
తాజా కథనాలు