Amalapuram Political War: అమలాపురంలో మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. పాతకక్షల కారణంగా వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా చంపారు. హత్య జరిగిన కొన్ని గంటలకే టీడీపీ నేత ఆఫీస్‌కు దుండగులు నిప్పంటించారు. ఆఫీస్ తగలబడుతుండగానే ఈదరపల్లిలో మరో వ్యక్తి ఇంటిని ధ్వంసం చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారకముందే అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు. పరిస్ధితిని కట్టడి చేసేందుకు డీఐజీ సైతం రంగంలోకి దిగారు. హుటాహుటిన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ శ్రీధర్ అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేత పల్లంరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మంత్రి కొడుకును ఎదురించినందుకే...!
అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నెలకొంది. ముగ్గురు యువకులను అరెస్ట్ చేయడంతో బాధిత కుటుంబాలు నిరసనకు దిగాయి. కామనగరువులో మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో యువకులు ఆయనపై తిరగబడడంతోనే వారిని అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే ముగ్గురు యువకులు ఉన్నా..పోలీసులు ఎందుకు అరెస్ట్ చూపించలేదంటూ మండిపడుతున్నారు.
Also Read: ఇడుపులపాయలో షర్మిల…నాన్న స్మృతిలో..!!