Pawan Kalyan: డిప్యూటీ సీఎంతో పాటు పవన్‌కు చంద్రబాబు కీలక పదవి

AP: పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్-గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత అర్థరాత్రి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Chandrababu: పవన్‌ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేను : చంద్రబాబు
New Update

Pawan Kalyan: ఏపీలో మంత్రి వర్గ కూర్పు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో కూటమి గెలుపుకు కీలకంగా వ్యవహరించిన పవన్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖరారు అయినట్టు పార్టీలో చర్చ జరుగుతుండగా.. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి శాఖను పవన్ కి కేటాయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే జనసేన నుంచి మంత్రిగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకశాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా సాయంత్రం మంత్రులకు శాఖల కేటాయింపు సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలని దానిపై కొలిక్కి రానుంది.

#pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe