Allu Arjun : కెమెరా ముందుకు అల్లు అర్జున్‌ భార్య.. అయితే సినిమాలో కాదు!

అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి కెమెరా ముందుకు వచ్చి యాక్ట్‌ చేశారు. అయితే ఆమె సినిమాల్లోకి రాలేదు. ఓ చిన్న కుర్రాడితో కలిసి ఓ యాడ్‌ లో యాక్ట్‌ చేశారు.స్నేహరెడ్డి నటించిన ఆ యాడ్‌ ఏంటంటే..కిండర్‌ బ్రాండ్ కి సంబంధించిన ఓ యాడ్‌ లో స్నేహ రెడ్డి తన నటన ప్రతిభను చూపించింది.

New Update
Allu Arjun : కెమెరా ముందుకు అల్లు అర్జున్‌ భార్య.. అయితే సినిమాలో కాదు!

Allu Arjun Wife : అల్లు అర్జున్‌ భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహ ఎప్పుడూ సోషల్ మీడియా(Social Media) లో యాక్టివ్‌ గా ఉంటూ తనవి, పిల్లలవి ఫోటోలు పోస్ట్‌ చేస్తూ అటు అల్లు అర్జున్‌(Allu Arjun) అభిమానులతో పాటు..తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంది. నేటి తరం హీరోయిన్లకు అల్లు అర్జున్‌ భార్య గట్టి పోటీనే అని చెప్పవచ్చు.

ఎందుకంటే స్నేహరెడ్డి అంత అందంగా ఉంటుంది కాబట్టి. అందుకే బన్నీ స్నేహ రెడ్డి ఎప్పుడూ కెమెరా ముందుకు వచ్చిన సరే వదినమ్మతో కలిసి ఓ సినిమా చేయాలంటూ అభిమానులు అడుగుతుంటారు. ఈ క్రమంలోనే అనేక సార్లు స్నేహరెడ్డి హీరోయిన్‌ గా రాబోతుందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి.

publive-image

అల్లు అర్జున్‌ ఒప్పుకున్నప్పటికీ అల్లు అరవింద్‌(Allu Aravind) మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటిని కొట్టి పారేస్తూ స్నేహరెడ్డి కెమెరా ముందుకు వచ్చి యాక్ట్‌ చేశారు. అయితే ఆమె సినిమాల్లోకి రాలేదు. ఓ చిన్న కుర్రాడితో కలిసి ఓ యాడ్‌ లో యాక్ట్‌ చేశారు.

స్నేహరెడ్డి నటించిన ఆ యాడ్‌ ఏంటంటే..కిండర్‌ బ్రాండ్ కి సంబంధించిన ఓ యాడ్‌ లో స్నేహ రెడ్డి తన నటన ప్రతిభను చూపించింది. కిండర్‌ ఎస్‌ చోకో బోన్స్‌ క్రిస్పీ చాకో ప్రొడక్ట్‌ ను స్నేహ రెడ్డి ప్రమోట్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.

ఇందులో స్నేహ రెడ్డి చాలా న్యాచురల్‌ గా ఉంది. ఎక్కువ మేకప్‌ లేకుండా చాలా బాగుంది. ఈ యాడ్‌ లో స్నేహ రెడ్డి పక్కన ఓ బాబు కూడా ఉన్నాడు. యాడ్ చూసిన వారంతా కూడా ఆ కుర్రాడి ప్లేస్‌ లో అల్లు అయాన్‌(Allu Ayaan) ను పెట్టి ఉంటే చాలా బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

Also read: అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్..యాపిల్‌ ని దాటేసింది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు