Buddy : ఓటీటీలోకి అల్లు శిరీష్ 'బడ్డీ'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..! అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'బడ్డీ' ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్టు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ..ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 25 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Buddy Movie : టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ లాంగ్ గ్యాప్ అనంతరం నటించిన తాజా చిత్రం 'బడ్డీ'. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్. అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 2 న థియేటర్స్ లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. Also Read : ఆ పాత్రల వల్ల ఎంతో ఒత్తిడికి లోనయ్యా.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ Edhuru thirigina simhani, puli ni, chiruthani choosuntaru, anyayam pai thiragabadda oka teddy bear ni choosara? Ippudu choostharu.#Buddy is coming to Netflix on 30 August in Telugu, Tamil, Malayalam and Kannada!#BuddyOnNetflix pic.twitter.com/3eaV05kgne — Netflix India South (@Netflix_INSouth) August 25, 2024 ఇక ఈ సినిమా ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతోంది. 'బడ్డీ' ఆగస్టు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. #allu-sirish #buddy-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి