బన్నీతో గురూజీ పాన్ ఇండియా రేంజ్ మూవీ!

త్రివిక్రమ్‌ శ్రీనివాస్ అల్లు అర్జున్‌ కాంబో లో త్వరలో సినిమా రాబోతున్నట్లు బన్నీ వాసు ప్రకటించారు. ఆ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలిపారు.

బన్నీతో గురూజీ పాన్ ఇండియా రేంజ్ మూవీ!
New Update

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా తీస్తున్నాడు అంటే అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. అలాంటిది గురూజీ తో బన్నీ మూవీ అంటే ఇక ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి నుంచి 3 సినిమాలు వచ్చి మంచి హిట్‌ ని అందుకున్నాయి.

త్వరలోనే నాలుగో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఒకదానిని మించి ఒకటి విజయాలు సాధించాయి.వసూళ్ల పరంగా చూసుకున్న కూడా చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాబోతున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయం గురించి బన్నీ వాసు మీడియాకి తెలిపారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ మహేష్‌ బాబుతో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత బన్నీతోనే ఉండబోతున్నట్లు బన్నీ వాసు అన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌ లో ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం బన్నీ కూడా పుష్ప సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివికక్రమ్‌ తో సినిమా ఉంటుంది అనుకుంటే..బోయపాటితో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని ఆయన మరో మాట అన్నారు. బన్నీ బోయపాటి కాంబినేషన్లో రెండో సినిమా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తుంది.

Also read: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్‌!

#allu-arjun #trivikram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe