Allu Arjun: వరద బాధితులకు సాయంగా కోటి విరాళం ప్రకటించిన పుష్పరాజ్‌!

ఏపీ,తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను.ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో 50 లక్షలు చొప్పున రూ .కోటి విరాళంగా ఇస్తున్నట్లు బన్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

New Update
Allu Arjun : 'పుష్ప 2' కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారిలో ముఖ్యంగా టాలీవుడ్‌ హీరోలు ఉన్నారు. ఇప్పటికే మెగా స్టార్, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు కూడా భారీ విరాళాలు ప్రకటించారు. అంతేకాకుండా అసలు ఈ విరాళాలకు నాంది పలికిన జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా కోటి ఇచ్చారు.

బాలకృష్ణ , మహేష్‌ బాబు, ప్రభాస్‌ , సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌, వైజయంతి మూవీస్‌ కూడా భారీగానే విరాళాలు ప్రకటించగా..తాజాగా ఈ విషయం పై అల్లు అర్జున్‌ స్పందించారు. ఆయన కూడా రెండు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న 'ఎక్స్' వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. ఈ క‌ష్ట స‌మ‌యం తొలిగిపోయి, రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆనందంగా ఉండాల‌ని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు అల్లు అర్జున్‌ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో 50 లక్షలు చొప్పున రూ .కోటి విరాళంగా ఇస్తున్నాను. ఈ విప‌త్తు నుంచి అందరూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అంటూ బన్నీ ట్విటర్లో పేర్కొన్నారు.

Also Read: వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు