పోరంబోకులం..ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకోలేదు..!

'ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోని ఇద్దరం పోరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. 'పుష్ప' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డ్స్‌ అందుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్‌ నెట్టంట్లో వైరల్‌గా మారాయి.

New Update
పోరంబోకులం..ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకోలేదు..!

Allu Arjun Comments Viral in Social Media: 'పుష్ప' మూవీకి జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే. అటు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో, నేషనల్ అవార్డు విన్నర్స్ కు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

"నాతో పాటు దేవి శ్రీ ప్రసాద్ కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో మా నాన్న చాలా సంతోషపడ్డారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉంది అంటూ పొంగిపోయారు. ఎందుకంటే ఇవాళ సత్యమూర్తి (దేవి శ్రీ ప్రసాద్ తండ్రి) గారు లేకపోవచ్చు.. దేవి కూడా నా బిడ్డ లాంటివాడే.. అతడు అవార్డు అందుకోవడాన్ని నేను చూడాలి అంటూ నాన్న ఢిల్లీ వచ్చారు. నాకు జాతీయ అవార్డు వచ్చినందుకు ఎంత ఆనంద పడ్డారో, అంతే సమానంగా, దేవికి అవార్డు వచ్చినందుకు కూడా ఆనందపడ్డారు.

Also Read: బింబిసార డైరెక్టర్ తో మెగా 156 మూవీ

publive-image

అప్పుడు నేను మా నాన్నతో అన్నాను.. నాన్నా నీ భాషలో చెప్పాలంటే.. చెన్నైలో ఇద్దరు పోరంబోకులు.. కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకోని వాళ్లం.. ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా? అని అడిగాను" అంటూ పార్టీకి హాజరైన అందరినీ నవ్వించారు. ఈ క్రమంలోనే తమ సక్సెస్ పై బన్నీ బెస్ట్ ఫ్రెండ్ ఈ విధంగా కాంప్లీమెంట్ ఇచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ప్రిన్సిపల్ దగ్గర టీసులు తీసుకున్న మీరు ఇలా   ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్  తీసుకున్నందుకు బాధగా అనిపిస్తుందిరా అంటూ కౌంటర్ వేశాడని ఫన్నీ కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్.  తన స్నేహితులు కూడా ఈ పోరంబోకులకా జాతీయ అవార్డు వచ్చిందని అనుకుంటూ ఉంటారని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు