Allu arjun: పుష్ప-2 వీడియోతో అల్లు అర్జున్‌ బిగ్‌ సర్‌ప్రైజ్

పుష్ప-2 వీడియో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోతో అభిమానులు ఫిదా అయ్యారు.

New Update
Allu arjun: పుష్ప-2 వీడియోతో అల్లు అర్జున్‌ బిగ్‌ సర్‌ప్రైజ్

బన్నీబిగ్ గిఫ్ట్..

అల్లు అర్జున్ (Allu arjun) ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. రీసెంట్‌గా మామ కోసం పలు కార్యక్రమాల్లో సందడి చేసి బన్నీ.. తాజాగా తను చేస్తున్న మూవీ పుష్ప-2కి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసి తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు.ఈ సర్‌ప్రైజ్‌ను చూసిన అభిమానులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తన రోజువారి పని ఎలా ప్రారంభమవుతుందో కూడా తెలిపారు. దీంతో పాటు పుష్ప-2 మూవీకి (Pushpa-2) సంబంధించిన మేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు బన్నీ. ఇందులో తన అభిమానులపై పూల వర్షం కురిపించి.. పుష్ప సినిమా తనకెంతో ప్రత్యేకమైనదని బన్నీ చెప్పుకోచ్చారు.

View this post on Instagram

A post shared by Instagram (@instagram)

ప్రేమను వివరించడం కష్టం

ఇక ‘పుష్ప2’‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే అక్కడి వీడియో ఒక్కటి అల్లు అర్జున్‌ చూపించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. భారత్‌లో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారు..వారి ప్రేమను వివరించడం చాలా కష్టమని చెప్పారు. ‘పుష్ప-2’ షూటింగ్‌ జరుగుతున్న టైంలో నా కోసం ఫ్యాన్స్‌ ఎంతో మంది వచ్చారు..వారి ప్రేమ నన్ను సరిహద్దులను అధిగమించేలా చేస్తోందని బన్నీ అన్నారు. అంతేకాదు నన్ను చూసి వాళ్లు గర్వపడేలా ఉంటానని బన్నీ చెబుతున్నారు. నా 20వ చిత్రంగా పుష్ప-2 తెరకెక్కుతోందన్నారు. ఇక ‘పుష్పరాజ్‌’ పాత్రే. అతడు దేనికీ వెనకడుగు వేయడని పుష్పలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదేనన్నారు. చిత్ర దర్శకుడు సుకుమార్‌ ఈ వీడియోలో మాట్లాడుతూ పుష్ప-2 తనకెంతో ప్రత్యేకమైనదన్నారు. ఈ మూవీ షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నిన్న సాయంత్రం అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాలో సర్‌ప్రైజ్‌ తెలుపుతూ పోస్ట్‌ పెట్టినప్పటి నుంచి ఆ మూవీ కోసం ఆసక్తిగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన వారంతా తెగ ఆనందపడుతున్నారట. 2021లో విడుదలై పుష్ప సూపర్‌హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే.

ఉత్తమ నటుడిగా అవార్డు..

ఇక ఉత్తమ నటుడిగా.. తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌ను ఎంపిక అయిన విషయం తెలిసిందే. పుష్ప చిత్రంలో సుకుమార్ దర్శకత్వంలో నటనకు ఈ గుర్తింపు వచ్చింది. దేశవ్యాప్తంగా పుష్ప సినిమా సూపర్ హిటైంది. ఈ మూవీలో ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్ కనిపిస్తారు.  'తగ్గేదేలా' అంటూ 'గడ్డాన్ని చేతితో తిప్పే మేనరిజం డైలాగ్. అంతటా ఫుల్‌ వైరలైంది. మొదటి నుంచి పుష్ప మూవీకి అవార్డులు ఖాయమన్న అభిమానులు..అదే జరిగడంతో వారి ఆనందానికి హద్దులేదు. ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ ఏడు భాషలు పోటీ పడ్డాయి. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తొలిసారి పది అవార్డులను సొంతం చేసుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఆర్ఆర్ఆర్ సినిమా 6 అవార్డులను సొంతం చేసుకుంది. పుష్ప రెండు అవార్డులతోపాటు..ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక అయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు